KGF: ఆ రీజన్ తో ‘కె.జి.ఎఫ్’ ని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

కన్నడ సినిమాలపై ప్రేక్షకులకి, ట్రేడ్ వర్గాలకి, విమర్శకులకి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉండేది. ఆ అభిప్రాయాలను మార్చేసిన సినిమా అంటే ‘కేజీఎఫ్’ అనే చెప్పాలి. కన్నడలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రికార్డు కలెక్షన్లను రాబట్టింది. కన్నడలో కూడా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అంటే కె.జి.ఎఫ్ వల్లే అని చెప్పాలి.

KGF

ఇంకో మాటలో చెప్పాలంటే కన్నడ సినిమాల ప్రతిష్టను పెంచింది ‘కె.జి.ఎఫ్’. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ ఈ సినిమాతో ఇండియా మొత్తం పాపులర్ అయిపోయారు. అయితే వాస్తవానికి… ‘కేజీఎఫ్’ సినిమాను ముందుగా ఓ స్టార్ హీరో కోసం అనుకున్నారట. ఆ హీరోకి కథ వినిపిస్తే.. ‘ఈ రోజుల్లో కన్నడ సినిమాలు ఎక్కడ ఆడతాయి? పైగా బిగ్ బడ్జెట్ అంటున్నారు.. అది కష్టమే’ అంటూ తిరస్కరించాడట .

 

ఈ విషయాన్ని ‘కేజీఎఫ్‌ను’ సహ నిర్మాత అయిన చలువే గౌడ చెప్పుకొచ్చారు. ఆ స్టార్ హీరో పేరైతే చెప్పలేదు కానీ మొదట ఓ పెద్ద స్టార్‌ను హీరోగా చేస్తారా అని అడిగితే, కన్నడ సినిమాలకి ఆ స్థాయి మార్కెట్ లేదు అంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి ఆ టైంలో కిచ్చా సుదీప్, పుణీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ కి తప్ప మిగిలిన వాళ్ళకి పెద్దగా మార్కెట్ లేదు అని ఆ నిర్మాత కూడా ఒప్పుకున్నాడు. ‘ఇప్పుడు ఆ హీరోలు పెద్ద సినిమాలు చేయడానికి మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అని కూడా చలువే గౌడ చెప్పుకొచ్చారు.

ఇప్పట్లో రికార్డులు ఆగేలా లేవు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus