1990 లలో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో ఈమె క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ‘రథసారథి’ ‘బంగారు బుల్లోడు’ ‘ఆకాశ వీధిలో’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది. ఈ ఏడాది వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తన హవా ఇప్పటికీ తగ్గలేదు అని నిరూపించింది.
ఇదిలా ఉండగా.. రవీనా టాండన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన అభిమానుల వల్ల ఎదురైన చేదు అనుభవాలు వివరించింది. ఆమె మాట్లాడుతూ.. “గతంలో ఓ అభిమాని రక్తంతో రాసిన లెటర్ లను మా ఇంటికి కొరియర్ చేశాడు. అవి మాత్రమే కాదు వాటితో పాటు అశ్లీల చిత్రాలను కూడా పంపించాడు. అతని పిచ్చి చూసి నాకు చాలా భయం వేసింది. అటు తర్వాత ఓ రోజు నేను..నా భర్త, పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా మేము ఆగాలని రాయి విసిరాడు.
ఈ క్రమంలో నేను పోలీసులను ఆశ్రయించాను. ఓ రోజైతే నా ఇంటి ముందే కూర్చుని నా కోసం ఎదురు చూసేవాడు. కొన్ని రోజులైనా ఆ అభిమాని అక్కడ నుండి కదల్లేదు. దీంతో మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది.ఇక నాకు ఫోటో గ్రఫీ అంటే చాలా ఇష్టం. సినిమాలు చేస్తున్నప్పటికీ .. మరోపక్క ఫోటోగ్రఫీ కూడా చేసేదాన్ని.
నేను తీసిన ఫోటోలు ఎగ్జిబిషన్ లలో, ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించేవారు. నేచురల్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫోటోగ్రఫీలో తీసిన కొన్ని ఫోటోలు ముంబై లోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ లో ప్రదర్శించేవారు’’ అంటూ రవీనా టాండన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.