మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 మూవీ అన్ని హంగులు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాకావడంతో దీనిపై మొదటినుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాదు హీరోగా 150 సినిమా అయినందువల్ల చిరు తనయుడు నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గత వారం సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ ఫిల్మ్ ఎటువంటి కట్స్ లేకుండా యూఏ సర్టిఫికెట్ అందుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసారు. వారు చెప్పిన దాని ప్రకారం ఖైదీ నంబర్ 150 మూవీ ఫస్ట్ రివ్యూ …
మెగాస్టార్ చిరంజీవి భారీ ఫైట్ తో ఎంట్రీ ఇస్తారు. రైతుల భూములు దారుణంగా లాక్కునే వారిపై విరుచుకు పడుతుంటారు. కొంచెం కామెడీ, కొంచెం యాక్షన్ అన్న రీతిలో ఫాస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ వద్ద సూపర్ ఫైట్ తో పాటు గొప్ప ట్విస్ట్ ఉంటుంది. చిరు డ్యూయల్ రోల్ చేశారనే సంగతి ప్రేక్షకుడికి ఇక్కడ తెలుస్తుంది. ఇంట్రెవెల్ తర్వాత ఒక చిరంజీవిని పోలీసులు జైలులో బంధిస్తే మరో చిరంజీవిని విలన్ ముప్పుతిప్పలు పెడుతుంటాడు. స్థలం కోసం వృద్దాశ్రమాన్ని కూడా విలన్ సొంతం చేసుకోవాలని అక్కడ నివసించే ముసలివారిని హింసిస్తాడు. ఇలా రైతులు, వృద్ధులను కష్టపెట్టిస్తున్న దుర్మార్గుడికి ఇద్దరు హీరోలు ఎలా బుద్ధి చెబుతారనేది? కథ.
తమిళ చిత్రం కత్తి కి ఇది రీమేక్ అయినప్పటికీ ఫ్రెష్ లుక్ కోసం అనేక సీన్లు వివి వినాయక్ కొత్తగా రాసుకున్నట్లు తెలిసింది. మాతృకలో ఉన్న కాయిన్ ఫైట్ కి చిరు స్టైల్ ని జోడించి ఆ ఫైట్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చారు. పాటలు ఐదే అయినప్పటికీ యాక్షన్ సీన్స్ నుంచి మంచి రిలీఫ్ నిస్తాయి. రాయ్ లక్ష్మి ఐటెం సాంగ్ విజిల్స్ వేయిస్తాయి. బ్రహ్మానందం కాసేపు కనిపించినా నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్రకు తగ్గ న్యాయం చేసింది. సినిమాలో కాయిన్ ఫైట్ తో పాటు పాటలు హైలెట్ గా నిలిచాయని చూసిన వారి టాక్. క్లైమాక్స్ మాత్రమే నిరాశపరుస్తుందని.. మిగతా చిత్రం మొత్తం బాగుందని సమాచారం. భారీ ఫైట్లు, హుషారెత్తించే డ్యాన్స్ లు, సరదా సన్నివేశాలతో ఖైదీ నంబర్ 150 మూవీ సాగిపోతుందని, ఈ చిత్రం మెగాస్టార్ మాస్ అభిమానులకు చాలా బాగా నచ్చుతుందని సినీ ప్రముఖులు స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.