ఖలేజా దిలావర్ భార్య గుర్తుందా.. హీరోయిన్స్ కంటే ఘాటుగా..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్నేళ్ల క్రితం కనిపించకుండా పోయిన కొంతమంది నటి, నటులు మళ్లీ పాపులర్ అయ్యారు. మిగతా సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా, ఈ తరం సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో ఒకరు ‘ఖలేజా’ సినిమాలో మెరిసిన దివ్య మేరీ సిరియాక్ (Actress). ఆమె తక్కువ సీన్‌లలో కనిపించినా, మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  (Trivikram) దర్శకత్వంలో వచ్చిన మహేశ్ బాబు  (Mahesh Babu) హిట్ మూవీ ‘ఖలేజా’లో (Khaleja)  దిలావర్ సింగ్ భార్య పాత్రలో ఈమె నటించింది.

Actress

సినిమా అంతా యాక్షన్, కామెడీ సీన్‌లలో సాగుతుంటే, ఆమె సీన్ కొద్దిపాటి కళ్లకి కనబడుతుంది. మహేష్ బాబు చెక్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆమె రొట్టెలు చేసుకుంటూ ఉంటుంది. కేవలం ఆమె ఫేస్ లుక్ మాత్రమే అక్కడ హైలెట్ అవుతుంది. ఆమె అప్పటి నేచురల్ లుక్ ప్రేక్షకుల మనసుల నిలిచిపోయింది. ఆ తర్వాత దివ్య (Actress) మరొకటి రెండు సినిమాల్లో కనిపిస్తుందని భావించారు కానీ, అలా జరగలేదు. ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆమెకు సంబంధించిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

అప్పుడు రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో సింపుల్ లుక్‌లో కనిపించిన ఆమె ఇప్పుడు ఫ్యాషన్, స్టైలింగ్ విషయంలో ఎంతో మారిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, దివ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. తన రీసెంట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. ఆమెను ఇంతకాలం మర్చిపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఆ ఫోటోలు చూసి యమా ఆశ్చర్యపోతున్నారు.

ఆ ఫోటోల ద్వారా చాలా మంది కొత్తగా తెలుసుకుంటున్నారు. ఆమె అప్పటి లుక్, ఇప్పటి లుక్ చూస్తే అస్సలు పోలికలే లేవు. కానీ, ఏజ్ పెరిగినా ఆమె స్టైల్, అందం మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఖలేజా’ తర్వాత దివ్య (Actress) మరొకటి రెండు సినిమాల్లో అవకాశాలు పొందాలని ప్రయత్నించినప్పటికీ, అవి సక్సెస్ కాలేదట. అందుకే ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉన్నట్లు టాక్.

ఎంత ఖర్చుపెడితే ఏంటి? నేనైతే నో చెప్పేస్తా అంటున్న నిత్య మీనన్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus