సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఏంటి? గత కొన్ని నెలలుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. దీనికి కారణం ఆయన దర్శకత్వంలో అనౌన్స్ అయిన ఓ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. మధ్యలో వేరే సినిమా చేసి వచ్చినా ఆ సినిమా సంగతి తేలలేదు. అయితే ఇప్పుడు అదేదో తేలిపోతుంది అని అంటున్నారు. ఈ లోపు సురేందర్ మరో హీరోతో సినిమా ఓకే చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమా పవన్ కల్యాణ్‌ది అయితే.. ఇప్పుడు చర్చల్లోకి వచ్చిన సినిమా ‘కిక్’ కాంబినేషన్.
అవును, ‘కిక్’ కాంబో రవితేజ – సురేందర్ రెడ్డి మరోసారి కలుస్తున్నారు అని సమాచార. రవితేజ కెరీర్‌లో బిగ్ హిట్, బెస్ట్ అండ్ హిలేరియస్ క్యారెర్టర్ అంటే ‘కిక్’లోనిదే. అందుకే ‘కిక్ 2’ అని మరో సినిమా చేశాడు. అయితే ఆ సినిమా సరైన ఫలితం అందుకోలేదు అనుకోండి. అయితే ఇప్పుడు మరోసారి సూరికి ఛాన్స్ ఇవ్వాలని రవితేజ అనుకుంటున్నారట. ‘ఏజెంట్’ తరవాత సురేందర్ రెడ్డి మరో ప్రాజెక్ట్ చేయలేదు. అయితే మధ్యలో చాలామందికి కథలు వినిపించారు. అందులో వెంకటేష్ కూడా ఉన్నారు.
ఈ మధ్య పవన్ కల్యాణ్ సినిమా పనులు మళ్లీ మొదలుపెట్టారు. అయితే పవన్ ఇప్పట్లో డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో మరో హీరోకి కొత్త కథ చెబుదాం అనుకుని తనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన రవితేజకు చెప్పారట. ఆయన కూడా కథ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నారట. అయితే పవన్ కల్యాణ్ సినిమానా? లేక రవితేజ సినిమానా అనేది తేలడం లేదు. త్వరలో ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
‘కిక్’లో కల్యాణ్ పాత్రలో రవితేజను చూపించిన విధానం సూపర్. ఇప్పుడు మరోసారి కలిస్తే ఇంకెలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పాత్ర క్లిక్ అయిందా.. సినిమాకు విజయం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ‘కిక్ 2’లో అదే మిస్ అయింది.