Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్ అబ్బవరం రెడీ!
- June 14, 2026 / 05:48 PM ISTByFilmy Focus Desk
‘క’, ‘కె ర్యాంప్’ అంటూ వరుసగా ‘K’ సినిమాలతో విజయం అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. త్వరలో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఓ మారు ప్రచారం స్టార్ట్ చేసిన ఆపేసి ఈ సినిమా ప్రచారాన్ని మళ్లీ స్టార్ట్ చేశారు. ఆ సినిమా ఎప్పుడొస్తుంది అనేది తర్వాత చూద్దాం. ఈ లోపు ఆయన మరో సినిమా స్టార్ట్ చేసేశాడు. స్వీయ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టారు. దీనికి K అనే అక్షరంతో పేరు పెట్టాలని అనుకుంటున్నారట.
Kiran Abbavaram
ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీలుక్‌ను కూడా విడుదల చేశారు. పల్లెటూరి కుర్రాడిలా, వంట చేస్తున్నట్లుగా కిరణ్ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాల్ని మేళవించి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా సినిమాను సిద్ధం చేస్తారని సమాచారం. శుక్రవారం నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది.

ఈ సినిమాలో కిరణ్‌కి జోడీగా దేవిక భట్ నటిస్తోంది. తనకు కలిసొచ్చే సాయి కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తన సినిమాలకు రైటర్‌గానో, దర్శకత్వ విభాగంలోనే కల్పించుకుని పని చేసే హీరోలు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. ఇప్పుడు కిరణ్ కూడా అలానే మెగాఫోన్ పట్టుకున్నారన్నమాట.
మరోవైపు కిరణ్ అబ్బవరం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కడప నేపథ్యంలో ‘గువ్వల చెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందనల సినిమా ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ ఈ సిరీస్‌కి షో రన్నర్‌గా వ్యవహరిస్తారట. ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో తెరకెక్కిస్తున్నారు.
వెంకటేశ్ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?










