యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అతను చేసిన 11 సినిమాల్లో 6 డీసెంట్ సినిమాలు ఉన్నాయి. ‘రాజావారు రాణిగారు’ ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ ‘సమ్మతమే’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ‘క’ ఇప్పుడు ‘K-RAMP’ వంటివి బాగా ఆడాయి. మార్కెట్ కూడా పెరిగింది. ఓ ప్లాప్ పడింది అంటే.. అతను నెక్స్ట్ సినిమాకి జాగ్రత్త పడే విధానం కూడా బాగుంటుంది.
అన్నిటికీ మించి అతను టాలెంటెడ్ టెక్నీషియన్స్ ను కూడా టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. అతను పరిచయం చేసిన రవి కిరణ్ కోలా(రాజావారు రాణిగారు దర్శకుడు) ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. అలాగే మురళీ కిషోర్ అబ్బూరు ఇప్పుడు అఖిల్ తో ‘లెనిన్’ అనే పెద్ద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కిరణ్ పరిచయం చేసిన టాలెంటెడ్ టెక్నిషియన్స్ లో సతీష్ రెడ్డి మాసం కూడా ఒకరు.
‘సమ్మతమే’ సినిమాతో ఇతన్ని సినిమాటోగ్రాఫర్ గా లాంచ్ చేశాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది. తర్వాత కిరణ్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘క’ సినిమాటోగ్రాఫర్ కూడా సతీష్ రెడ్డినే. అందులో విజువల్స్ టాప్ నాచ్ లో ఉండటానికి సతీష్ పనితనమే కారణం అని చెప్పాలి. ఇక కిరణ్ లేటెస్ట్ హిట్ మూవీ ‘K-RAMP’ కి కూడా సతీష్ రెడ్డినే సినిమాటోగ్రాఫర్.
ఇలా డీఓపీతో కిరణ్ హ్యాట్రిక్ కొట్టినట్టు అయ్యింది. ఇక సతీష్ రెడ్డి ప్రస్తుతం వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.