సంపు బ్రీత్ లెస్ డైలాగ్ అదుర్స్
- May 23, 2016 / 01:57 PM ISTByFilmy Focus
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మరోసారి టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గా మారాడు. అతను హీరోగా నటించిన కొత్త చిత్రం కొబ్బరిమట్ట టీజర్ సోమవారం రిలీజ్ అయ్యింది. ఇందులో సంపు చెప్పిన బ్రీత్ లెస్ డైలాగ్ ఆకట్టుకుంది. పెదరాయుడు పాత్రలో ఆడదాని విలువ గురించి నిముషం పాటు సంపు సీరియస్ గా చెప్పి నవ్వులు తెప్పిస్తున్నాడు.
ఈ ఒక్క డైలాగ్ తో సినిమా స్పూఫ్ సీన్లతో సరదాగా సాగిపోనున్నట్లు చెప్పాడు. టీజర్ లో సీనియర్ పెదరాయుడు గా కూడా కనిపించి ద్విపాత్రాభినయం ఉన్నట్లు సూచించాడు. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్నఈ చిత్రం హృదయ కాలేయం లాగా ఎంటర్ టైన్ చేస్తుందని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












