Pawan Kalyan: తమిళ దర్శకులు పవన్‌కు కలిసొచ్చారా? రాలేదా? ఇదిగో లిస్ట్‌!

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో రీమేక్‌ల శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కెరీర్‌లో తొలి నాళ్ల నుండే పవన్‌ రీమేక్‌లు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత పవన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే మరో అంశం తమిళ దర్శకులు. పవర్‌ స్టార్‌ కెరీర్‌లో చాలామంది తమిళ దర్శకులతో సినిమాలు చేశాడు. తాజాగా ‘బ్రో’ సినిమా వచ్చి… మిశ్రమ స్పందనను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు పవన్‌కు తమిళ దర్శకులు కలిసొచ్చారా? విజయాల శాతం ఏంటి అనే చర్చ మొదలైంది.

తెలుగులో విజయవంతమైన దర్శకులు ఉన్న సమయంలోనే కొందరు తమిళ దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియా అంటూ ఇప్పుడు హీరోలు ఇతర భాషల దర్శకులతో చేస్తున్నారు కానీ.. పవన్‌ ఎప్పుడో స్టార్ట్‌ చేశాడు. అలా పవన్‌ ఇప్పటివరకు కోలీవుడ్ డైరెక్టర్లతో ఏడు సినిమాల్లో నటించాడు. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కలకాలం చెప్పుకునే సినిమా అంటే ‘తొలి ప్రేమ’ అని చెప్పాలి. 1998లో వచ్చిన ఈ సినిమా విజయం కంటే అందులో ఫీల్‌ ఎప్పటికీ ఫ్యాన్స్‌కి గుర్తుంటుందంటే అతిశయోక్తి కాదు.

కరుణాకర్ ‘తొలిప్రేమ’ సినిమాను తెరకెక్కించారు. ఆ విజయం ఇచ్చిన ఆలోచనతో ఆ తర్వాత ‘బాలు ABCDEFG’ అనే సినిమా ఇచ్చాడు. 2005లో వచ్చిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకోవడం గమనార్హం. ఇక కల్యాణ్‌ కెరీర్‌ మరో బెస్ట్‌ అంటే… ‘ఖుషి’. ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డుల వేట ఎలా ఉంటుందో, వసూళ్ల సునామి అంటే ఏంటో చూపించింది. అయితే అదే డైరక్టర్‌తో ఆ తర్వాత చేసిన ‘పులి’ తేడా కొట్టింది.

తమిళ దర్శకులు పరాజయాలు ఇస్తున్నా.. (Pawan Kalyan) పవన్‌ కోలీవుడ్‌ అభిమానం తగ్గలేదు. వరుసగా ‘బంగారం’, ‘పంజా’ సినిమాలు తమిళ దర్శకులకే ఇచ్చాడు. ధరణి దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘బంగారం’ భయపెడితే.. 2011లో వచ్చిన ‘పంజా’ పవర్‌ లేక ఇబ్బందిపెట్టింది. అయితే ‘పంజా’లో పవన్‌ లుక్‌ ఇప్పటికీ ఫ్యాన్స్‌కి చాలా ఇష్టం. అంతలా ఆ సినిమా దర్శకుడు విష్ణు వర్థన్‌ పవన్‌ను మార్చేశారు. కానీ విజయం అందుకోలేకపోయారు.

ఇక రీసెంట్‌ మూవీ ‘బ్రో’ దర్శకుడు సముద్రఖని కూడా తమిళ దర్శకుడే. ఈ సినిమాకు వసూళ్లు బాగున్నాయి అని తొలి వారంతంలో అనిపించినా.. ఆ తర్వాత ఆశించినంత మేర లేవు అంటున్నారు. కాబట్టి ఇప్పటికే మిశ్రమ స్పందన అనుకోవచ్చు. ఇలా మొత్తం ఏడు సినిమాలు చూస్తే.. ష్యూర్‌ షాట్‌ హిట్‌ కొట్టినవి ఏడింటిలో రెండు మాత్రమే.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus