Shankar : శంకర్ కోసం రంగంలోకి దిగిన కోలీవుడ్!

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తాజాగా ఆయన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరో ‘అపరిచితుడు’ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ‘అపరిచితుడు’ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించిన అన్ని హక్కులు తన దగ్గర ఉన్నాయని.. తన అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై శంకర్ కు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అయితే దీనిపై శంకర్ ఘాటుగా బదులిచ్చారు.

‘అపరిచితుడు’ కథా రచయితగా క్రెడిట్ తనకే ఉంటుందని.. ఆ కథను రీమేక్ చేయడంపై తనకు పూర్తి హక్కులున్నాయని అన్నారు. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చానీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో ఇండస్ట్రీ నుండి మెజారిటీ సపోర్ట్ శంకర్ కే లభిస్తోంది. కథ రాసిన వ్యక్తికి దానిపై హక్కులు ఉండవా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. శంకర్ దగ్గర పై చేసి ఇప్పుడు దర్శకులుగా కొనసాగుతున్న వారంతా ఆయనే సపోర్ట్ చేస్తున్నారు. చింబుదేవన్, అరిగ‌ళ‌వ‌న్, అట్లీ ఇలా అందరూ శంకర్ కు మద్దతుగా ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు.

కోలీవుడ్ ప్రముఖులు చాలా మంది ముందుకొచ్చి #Isupportdirectorshankar అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కావాలనే శంకర్ ని టార్గెట్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి తెరకెక్కించిన ‘ఐ’ సినిమా బడ్జెట్ విషయంలో విబేధాలు తలెత్తాయి. ఈ సినిమా సమయంలో రవిచంద్రన్ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. సినిమా రిలీజ్ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అప్పటి గొడవను దృష్టిలో పెట్టుకునే అప్పుడు శంకర్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారంటూ కొందరు వాదిస్తున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus