Prabhas: తమిళ హీరో చేతికి రాధేశ్యామ్ హక్కులు

రెబల్ స్టార్ ప్రభాస్ మూడవ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ మార్చు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు. తప్పకుండా ఈ సినిమా ఇన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు మిగతా భాషల్లో కూడా భారీగా ప్రమోషన్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Click Here To Watch

రాధేశ్యామ్ సినిమాకు తెలుగులో అయితే భారీగానే కలెక్షన్స్ అందే అవకాశం ఉంది. ఇక హిందీలో కూడా ఈ సినిమాపై అంచనాల స్థాయి గట్టిగానే ఉన్నట్లు అర్థం అయింది. ఇక తమిళంలో కూడా సినిమాను నెవర్ బిఫోర్ అనేలా భారీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక తమిళ రిలీజ్ హక్కులను అక్కడి యువ హీరో ఉదయనిధి స్టాలిన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా కూడా కొనసాగుతున్నాడు.

అంతేకాకుండా వారి సొంత ప్రొడక్షన్ రెడ్ గెంట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో పలు సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల రాధేశ్యామ్ సినిమా రిలీజ్ హక్కులను ఉదయనిధి స్టాలిన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. రాధేశ్యామ్ సినిమాను యువి క్రియేషన్స్ రెండు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బాలీవుడ్ లోనే 75 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమా మొదటి రోజు 100కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్ముతున్నారు. మరి సినిమా ఆ అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus