Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

  • February 11, 2026 / 11:33 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’ (Son Of). బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో..

ప్ర‌ముక రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారు. ‘సన్ ఆఫ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాను. భాస్కర భట్ల గారితోనే ఈ కథ కోసం ఎక్కువగా చర్చించాం. అప్పుడే నాకు మ్యూజిక్ డైరెక్టర్ రిషిని పరిచయం చేశాడు. రిషి ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. కిట్టు మాకు గొప్ప విజువల్స్‌ను ఇచ్చాడు. శోభా గారు అమ్మోరులా నా చేతిని పట్టుకుని మా సినిమాని ఇంత దూరం తీసుకు వచ్చారు. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్, నిర్మాత‌ శోభా రాణి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ అనే టైటిల్‌లోనే ఎంతో ఎమోషన్ ఉంది. సాయి నాకు చూపించిన ట్రైలర్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యాను. ఇది చాలా మంచి చిత్రం అవుతుందని అప్పుడే చెప్పాను. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ట్రైలర్ చూశాను. ఈ చిత్రంలో సాయి చక్కగా నటించాడు. మా వినోద్ గారు ఇందులో తండ్రి పాత్రను పోషించారు. శోభా గారు సినిమాను రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ విషయంలో సాయి గురించి, ఆయన శ్రీమతి గురించి మేం ఎక్కువగా ఆలోచించాం. సాయికి సినిమాలంటే చాలా ప్యాషన్. సాయి న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో యాక్టింగ్, మేకింగ్ గురించి నేర్చుకున్నాడు. ఈ మూవీని ఆల్రెడీ చూశాను. ఇదొక విచిత్రమైన కథ. ఈ కథకు స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టం. సాయి పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి’ అని అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ సినిమా శోభా రాణి గారి వల్లే ఇక్కడి వరకు వచ్చింది. సాయి గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఓ మంచి సినిమాకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘సన్ ఆఫ్’ మూవీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. ఇది నాకు తొలి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సతీష్ గారికి థాంక్స్. ఇది నాకు సుదీర్ఘమైన ప్రయాణం. మా హీరో సాయి గారి ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. రిషి మ్యూజిక్, కిట్టు విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

భాస్కర భట్ల మాట్లాడుతూ .. ‘సాయి నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం. నచ్చిన టెక్నిషియన్లను తీసుకుని సాయి ఈ మూవీని గొప్పగా నిర్మించాడు. ఇందులో రెండు మంచి పాటల్ని రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి, సతీష్ గారికి థాంక్స్. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌ రిషిని నేను పరిచయం చేసినట్టు అయింది. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రైటర్ లక్ష్మీ భూపాల మాట్లాడుతూ .. ‘సాయి నాకు పదిహేనేళ్ల క్రితం హీరో అవుతానని చెప్పాడు. ఇప్పుడు ఇలా ఓ మంచి కథతో ఆడియెన్స్ ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. ఫాదర్ ఎమోషన్‌తో తీసిన ‘సన్ ఆఫ్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ప్రాజెక్ట్ గురించి సాయి నాకు ముందే చెప్పాడు. నేను ఆల్రెడీ ఈ మూవీని చూశాను. నాన్న ఎందుకు వెనకపడ్డాడో ఈ సినిమాని చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు.

కెమెరామెన్ కిట్టు మాట్లాడుతూ .. ‘సింగిల్ షెడ్యూల్‌లో దాదాపు 30, 40 రోజుల్లో ‘సన్ ఆఫ్’ మూవీని పూర్తి చేశాం. సాయి గారు అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. ఈ మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రిషి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’తో ఇండస్ట్రీలోకి రావడం గర్వంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన సాయి, సతీష్ గారికి థాంక్స్. భాస్కరభట్ల గారి వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నైజాం డిస్ట్రిబ్యూట‌ర్‌ రిషికేశ్వ‌ర్ ఫిల్మ్స్ వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘సన్ ఆఫ్ సినిమాను నేను చూశాను. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. వెంట‌నే ఈ సినిమాను నైజాం డిస్ట్రిబ్యూట్ చేయ‌టానికి ఓకే చెప్పాను. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని గొప్ప‌గా చూపించే సినిమా.. మీ అంద‌రి స‌హకారంతో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో త్వ‌ర‌లోనే తెలుగులో డెబ్యూ అవుతున్న ముంబై న‌టి మిస్ సింబుల్ ఆసిఫ్‌, ముంబై డిస్ట్రిబ్యూట‌ర్ క‌మ‌లేష్ పాల్గొని సాయి సింహాద్రి హీరోగా, నిర్మాత‌గా రూపొందిన స‌న్ ఆఫ్ మూవీ పెద్ద విజ‌యం సాధించాల‌ని చిత్ర యూనిట్‌ను అభినందించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kona venkat
  • #Sai Simhadri
  • #Samudra
  • #Shobha Rani
  • #Son Of

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version