NTR30: తారక్30 కామెంట్లపై కొరటాల శివ రియాక్షన్ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ కాదనే వార్త ఫ్యాన్స్ ను ఎంతగానో హర్ట్ చేసింది. ఎన్టీఆర్30 కోసం వచ్చే ఏడాది ఏప్రిల్5 వరకు అభిమానులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో మీడియాకు దూరంగా ఉంటున్న కొరటాల శివ తాజాగా తిరుమలకు వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడిన కొరటాల శివ ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చారు.

ఎన్టీఆర్30 మూవీ భారీ విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నానని కొరటాల శివ మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఆయన కామెంట్లు చేశారు. గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని కొరటాల శివ పేర్కొన్నారు. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. గ్రాండ్ గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కానుందని కొరటాల శివ చెప్పకనే చెప్పేశారు.

కొరటాల శివ తన కామెంట్లతో ఈ సినిమాపై అంచనాలను పెంచారు. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న తారక్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. తారక్ కొరటాల శివ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ కూడా ఈ ఏడాదే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ కూడా రానుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు. కెరీర్ విషయంలో తారక్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus