కొరటాల…వర్మను ఫాలో అవుతున్నాడా??

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు రోజురోజుకీ తారాస్తాయికి చేరిపోతున్నాయి. అయితే ఈ సినిమాకి ఇంతటి క్రేజ్ రావడానికి కారణం ఈ కాంబినేషన్ అయితే, అటుపై ఆసకు విషయం ఈ సినిమా టీజర్, మరియు ఫర్స్ట్ లుక్. సినిమా ఫిశ్ర్ లుక్ నుంచి టీజర్ వరకూ అన్నీ సూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అసలే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై కొన్ని గుసగుసలు టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తున్నాయి…అవేమిటంటే…ఈ సినిమా వ్యవహారం చూస్తుంటే…కొరటాల మన రామ్ గోపాల్ వర్మను ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఎందుకు అంటే…ఈ సినిమాలో హీరో క్యారెక్టెరైజేషన్ అలా ఉంది మరీ. ఇప్పటివరకూ రిలేజ్ అయిన లుక్స్ ప్రకారం చూస్తే ఎన్టీఆర్ ఒక డాన్ లాగా కనిపిస్తున్నాడు, కానీ అసలైతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓక్ ఐఐటీ స్టూడెంట్ పాత్ర చేస్తున్నాడు. అయితే కధలో ఉన్న ట్విస్టుల రీత్యా ‘జనతా గ్యారేజ్’ లోకి వచ్చి జూనియర్  అన్ని రకాల రిపేర్లు చేసేస్తుంటాడు.  ఇలా ఒక  స్టూడెంట్ రౌడీగా మారడం అనే కాన్సెప్ట్ తో గతంలో వచ్చిన రామ్ గోపాల్ వర్మ శివ ఎటువంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిన విషయమే. రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ ఒక ట్రెండ్ సెట్టర్.

ఇప్పుడు ఎన్టీఆర్  ‘జనతా గ్యారేజ్’ స్టొరీ  కూడ ఇంచుమించు ‘శివ’ మూవీ తరహాలో ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది. ఇక అదే క్రమంలో బాగా చదువుకునే ఒక యువకుడు ఫ్యామిలీ కోసం ఒక లీడర్ తరహాలో మారి సెటిల్మెంటులు చేయడం లాంటి సన్నివేశాలు ‘జనతా గ్యారేజ్’ లో చూసినప్పుడు  సినిమాను చూసే ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ ‘శివ’ ‘గాయం’ సినిమాలు గుర్తుకు వస్తాయి అని అంటున్నారు సినిమా వర్గాలు. మరి ఈ ఫార్ములా ఎన్టీఆర్ కు ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus