Kota Bommali P.S: ఇలాంటి క్లైమాక్స్ ని యాక్సెప్ట్ చేస్తారా?

సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో.. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మలయాళంలో హిట్ అయిన ‘నాయట్టు’ కి రీమేక్ గా రూపొందింది (Kota Bommali P.S) ఈ సినిమా. ‘లింగి లింగి లింగిడి’ అనే పాట సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక ఈ చిత్రాన్ని కొంతమంది సినీ ప్రముఖులకు షో వేసి చూపించారు మేకర్స్.వారి టాక్ ప్రకారం.. ముగ్గురు పోలీసులు(శ్రీకాంత్, రాహుల్ విజయ్ , శివానీ రాజశేఖర్) ..లు ఒకరోజు పార్టీకి వెళ్లగా తిరిగి వచ్చే టైంలో అనుకోకుండా ఓ యాక్సిడెంట్ చేస్తారు.

ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబానికి చెందిన వాడు అని తెలుస్తుంది. ఈ కేసు నుండి తప్పించుకోవడానికి ఈ ముగ్గురు పారిపోతారు. దీంతో వీళ్ళ పై పగ ఉన్న కొందరు పొలిటీషియన్స్… అన్యాయంగా వీళ్ళ పై కేసులు బనాయించి వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తారు. క్లైమాక్స్ లో వీళ్ళు దొరికిపోయే టైంకి .. శ్రీకాంత్ పాత్ర ఊహించని పని చేస్తుంది. అది పొలిటికల్ లీడర్స్ కి పెద్ద షాకిస్తుంది.

అదేంటి అనేది తెరపై చూడాల్సిన కథగా తెలుస్తుంది. మొత్తంగా సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉందని.. కానీ క్లైమాక్స్ లో ట్రాజెడీ ఉండటంతో .. మలయాళం ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నట్టు ఈ కథని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో 40 శాతం స్క్రిప్ట్ లో మార్పులు చేశారట.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus