రవితేజ,శృతీ హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండీ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉంది. ఫిబ్రవరి 5న ఆహా ఓటిటిలో విడుదలైనప్పటికీ.. ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది ఈ చిత్రం. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో.. ఇంకా ‘క్రాక్’ విజయవంతంగా రన్ అవుతుంది. ఆల్రెడీ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ చిత్రం 29వ రోజున కూడా 0.12 కోట్ల వరకూ షేర్ ను రాబట్టడం ట్రేడ్ ను సైతం షాక్ కు గురి చేస్తోంది.గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఈ చిత్రం విజయంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.
ఇక ‘క్రాక్’ చిత్రం 29 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 11.78 cr |
సీడెడ్ | 6.04 cr |
ఉత్తరాంధ్ర | 4.16 cr |
ఈస్ట్ | 3.23 cr |
వెస్ట్ | 2.40 cr |
కృష్ణా | 2.35 cr |
గుంటూరు | 2.74 cr |
నెల్లూరు | 1.77 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 34.47 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.81 cr |
ఓవర్సీస్ | 0.86 cr |
టోటల్ వరల్డ్ వైడ్ : | 37.14 cr |
‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 29 రోజులకు గాను ఈ చిత్రం 37.14 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.అది కూడా ఓటిటి లో విడుదలయ్యాక కూడా..! ఏదేమైనా ఇప్పటివరకూ ఈ చిత్రం.. బయ్యర్లకు 19.14 కోట్ల లాభాలను అందించింది.అంటే డబుల్ ప్రాఫిట్స్ కు మించే.! అయితే ఈరోజుతో ఈ చిత్రం ఫుల్ రన్ ముగుస్తోందా లేదా అనేది చూడాలి..!
Click Here To Read Movie Review
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?