కరోనా కారణంగా కొన్ని నెలల పాటు మూతపడ్డ థియేటర్లు ఇటీవలే తిరిగి తెరుచుకున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా బాగానే ఆడడంతో మిగిలిన నిర్మాతలు కూడా ధైర్యం చేసి సినిమాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు మాస్ మహారహా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయి.
తీరా ఈరోజు సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్తే అక్కడ బొమ్మ పడలేదు. కొన్ని సమస్యల వలన సినిమా విడుదల ఆగిపోవడంతో.. రవితేజ అభిమానులు నిరాశ చెందారు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. ఇలాంటి గందరగోళానికి లోనవ్వడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ఎర్లీ మార్నింగ్ షోతో విడుదల కావాల్సిన ఈ సినిమా.. షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఆ తరువాత మ్యాట్నీ షోతో విడుదల అన్నారు.
కానీ ఇప్పుడు అసలు ఈ సినిమా ఈరోజు విడుదల కావడం లేదంటూ తాజా సమాచారం. అన్ని సమస్యలు పరిష్కరించుకొని జనవరి 13న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.