క్రిష్… బ్యాక్ టు బాలీవుడ్!

దక్షిణాది నుండి ముఖ్యంగా టాలీవుడ్ లోని దర్శకులు బాలీవుడ్ వెళ్లి సినిమాలు చేయడం ఈ రోజుల్లో చాలా తక్కువ. అలా హైదరాబాద్ నుండి ముంబై వెళ్లి జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి సత్తా చాటిన కొద్దిమంది దర్శకులలో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్). ప్రస్తుతం నందమూరి బాలకృష్ణను ‘శాతకర్ణి’గా ముస్తాబు చేస్తోన్న క్రిష్ మరోమారు ముంబై ఫ్లైట్ ఎక్కనున్నారన్న వార్త ఫిల్మ్ నగర్ లో గుప్పుమంటోందిప్పుడు.ప్రతిష్టాత్మక బాలయ్య వందో చిత్రమైన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు క్రిష్.ఈ సినిమా సంక్రాతి పండగకు విడుదల కానుంది.

దీని తర్వాత క్రిష్ సరాసరి ముంబై చేరుకోనున్నారట. హిందీలో తొలి ప్రయత్నంగా చేసిన ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ (రమణ రీమేక్, తెలుగులో ఠాగూర్) సినిమాతో బాలీవుడ్ వారిని మెప్పించిన క్రిష్ ఈసారి కూడా అక్షయ్ కుమార్ హీరోగానే ఓ కథ సిద్ధం చేశారట. ఇది కూడా సామాజిక అంశంతోనే సాగనున్నట్టు సమాచారం. క్రిష్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజికాంశాన్ని ప్రస్తావిస్తూంటారు. ‘కంచె’తో జాతీయ అవార్డు పొంది తన ఖ్యాతిని మరింత పెంచుకున్న క్రిష్ చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే అక్కడ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ‘రోబో2’, ‘జాలీ ఎల్ ఎల్ బి 2’ సినిమాల్లో నటిస్తున్న అక్షయ్ మరో రెండు బయోపిక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అవి క్రిష్ సినిమా తర్వాత ఏమిటా అన్నది తేలాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus