ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా మారనున్న కృష్ణ కుటుంబం!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎక్కువమంది నటీనటులుగా పరిచయమయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. వీరంతా హీరోలుగా రాణిస్తుంటే నిహారిక హీరోయిన్ గాకోనసాగుతోంది. ఇక నాగేంద్రబాబు ఆర్టిస్టుగా మంచి రోల్స్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ మంది హీరోలు కలిగిన ఫ్యామిలీగా మెగాస్టార్ కుటుంబం పేరుగాంచింది. ఆ తర్వాత అక్కినేని, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల్లో ఎక్కువమంది సినీ తారలున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా బోలెడంతమంది స్టార్స్ రెడీ కానున్నారు.

ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి సినిమాలు చేస్తున్నవారు మహేష్ బాబు, సుధీర్ బాబు మాత్రమే. కృష్ణ, మహేష్ అన్న రమేష్ బాబు సినిమాలకు దూరంగా ఉన్నారు. వారు వెనక్కి తగ్గిన వారసులు హంగామా చేయనున్నారు. విజయ నిర్మల తనయుడు నరేష్ హీరోగా, ఆర్టిస్టుగా నిరూపించుకున్నారు. అతని కొడుకు నవీన్ కృష్ణ ఓ సినిమాతో పలకరించాడు. ఇప్పుడతను హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరోవైపు కృష్ణ కూతురు, మహేష్ అక్క మంజుల మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె దర్శకురాలిగా ఓ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె కూతురు జాన్వి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మహేష్ మేనల్లుడు (ఎంపీ గల్లా జయదేవ్-పద్మావతిల తనయుడు) అశోక్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని.. అతడిని దిల్ రాజు హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రమేష్ బాబు కొడుకు కూడా త్వరలోనే హీరో అవుతాడని అంటున్నారు.

ఇప్పటికే బాలనటుడిగా నటించిన మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా కొంచెం పెద్దవాడయ్యాక హీరో కావడం గ్యారెంటీ. మరోవైపు సుధీర్ బాబు కొడుకు చరిత్‌ కూడా నటుడిగా స్థిరపడిపోవడానికి ఫిక్స్ అయిపోయారు. అతనిప్పటికే “భలే భలే మగాడివోయ్తో” పాటు ఇంకో సినిమాలో నటించాడు. ఇలా అందరినీ లెక్కబెడితే.. భవిష్యత్తులో మెగా ఫ్యామిలీకి దీటుగా తారలతో సూపర్ స్టార్ కుటుంబం టాలీవుడ్ ని ఏలనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus