Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

‘పెళ్ళిచూపులు’ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్.. తర్వాత ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ ‘కీడా కోలా’ వంటి సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు. ‘పెళ్ళిచూపులు’ పెద్ద హిట్ అయ్యింది… మిగిలిన సినిమాల ఫలితాలు ఎలా ఆడినా.. అవి యూత్ ని అయితే ఆకట్టుకున్నాయి. తరుణ్ భాస్కర్ జంజి కిడ్స్ ని రంజింపజేయగల దర్శకుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతని రైటింగ్లో ప్రాసలు, గ్రామర్ వంటివి ఏవీ ఉండవు.

Naga Chaitanya

అయినా సరే తరుణ్ భాస్కర్ సినిమాల్లోని డైలాగులు యూత్ కి వెంటనే ఎక్కేస్తాయి. అంటే అతని క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ అయినటువంటి ‘ఈఎన్ఈ 2’ చేస్తున్నాడు తరుణ్. దసరాకి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరోవైపు నాగ చైతన్య(Naga Chaitanya) కోసం అతను ఓ కథ రాసుకున్నట్టు తెలుస్తుంది. చైతన్య కూడా తరుణ్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే తరుణ్ స్క్రిప్ట్ డెవలప్ చేయాలి. ప్రస్తుతం నాగ‌చైత‌న్య.. కార్తీక్ దండు దర్శకత్వంలో `వృష‌క‌ర్మ‌` చేస్తున్నాడు.

తర్వాత నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.మధ్యలో నాగార్జున 100వ సినిమాలో కూడా చైతన్య నటించే అవకాశాలు ఉన్నాయి. రా కార్తీక్ దానికి దర్శకుడు. ఇవి రెండూ పూర్తయ్యాక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అది నాగ చైతన్య ఫుల్ లెంగ్త్ హీరోగా రూపొందే 25వ సినిమా కావొచ్చు.

చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus