పూరీ డ్రగ్స్ మ్యాటర్ పై కృష్ణ వంశీ.!

టాలీవుడ్ లో తలరాతలు మార్చే మ్యాటర్ గా ఉంది డ్రగ్స్ కేస్…అయితే ఈ కేస్ లో ఎవరెవరు దోషులు…ఎవరెవరు సాక్ష్యాలు…ఎవరెవరు నిందలు పడ్డ అమాయకులు అంటే…దాని సంగతి న్యాయస్థానాలు చూసుకుంటాయి…అయితే మధ్యలో ఆటలో అరటి పండులాగా ఈ మీడియా ఒకటి ఉంది కదా…అసలు గొడవ…గోల అంతా అక్కడే ఉంది అంటున్నారు సినిమా వాళ్ళు…అసలు మ్యాటర్ లోకి వెళితే…ఈ డ్రగ్స్ కేస్ అంతా పూరీ అండ్ టీమ్ చుట్టూ తిరుగుతూ ఉండడం…దాన్ని మీడియా రకరకాల కోణాల్లో హైలైట్ చెయ్యడం…చూసి చాలా మంది సినిమా ప్రముఖులు ఆ ఇష్యూ పై స్పందిస్తూ…మీడియాపై ఫైర్ అయ్యారు….అందులో మొదటిగా మన సెన్సేషనల్ పర్సన్యాలిటీ అయినా రామ్ గోపాల్ వర్మనే తీసుకుందాం…మీడియా మాట ఎలా ఉన్నా…విచారణ జరిగిన తీరుపై తీవ్ర అసహనం చెందాడు వర్మ…

ఈయన మాట అలా పక్కన పెడితే…పూరీ మ్యాటర్ పై స్పందించాడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ…దీనిపై మాట్లాడుతూ…మీడియా వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు కృష్ణ వంశీ…‘‘డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియా చాలా తుంటరిగా వ్యవహరించింది అని… ఈ విషయాన్ని అన్నిసార్లు చూపించాల్సిన అవసరం లేదు ఏమాత్రం లేదు అని… పూరి జగన్నాథ్ ‘శివ’ సినిమాకు జూనియర్ ఆర్టిస్టుగా వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు…అతను గొప్ప మనసున్న వ్యక్తి…ఎంతోమందికి సాయం చేశాడు అని… తన ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని విప్లవాత్మకంగా తట్టి లేపేలా చెప్పాలని ప్రయత్నిస్తాడు. దగుల్బాజీగా సినిమాలు తీసేసి డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అంటూ పూరీ గురించి చెబుతూనే…పదిమందికి సాయం చేసిన అతను ఈ కేసులో ఉన్నాడన్న వార్త వినగానే ఏడుపొచ్చేసింది అంటూ తన ఆవేదనని తెలిపాడు కృష్ణ వంశీ…మొత్తంగా చూసుకుంటే పూరీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది…డైకీ ఇంత సీన్ క్రియేట్ చెయ్యాల్సిన అవసరం లేదు అనేది సినిమా ప్రముఖుల వాదన.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus