కృష్ణవంశీ.. రామ్‌గోపాల్ వర్మ స్కూలు నుంచి వచ్చిన క్రియేటివ్ డైరెక్టర్. సినిమా సినిమాకు సంబంధం లేకుండా కొత్తదనంతో ఉంటాయి ఈయన సినిమాలు. యాక్షన్, డ్రామా, లవ్, కామెడీ, దేశభక్తి ఇలా ఏ యాంగిల్‌లోనైనా సినిమాలు తీయగల దిట్ట. పాటలు చిత్రీకరించడంలో, హీరోయిన్లను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాత అంతటి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు కృష్ణవంశీ. ఒకప్పుడు వరుస హిట్లతో బిజీగా వున్న ఆయన.. తర్వాత వరుస ఫ్లాప్‌లతో రేసులో వెనుకబడ్డాడు.
ఆయన తీసిన సినిమాల్లో ఖడ్గంకు మంచి స్థానముంది. దేశభక్తి ప్రధానాంశంగా.. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా వుంటుంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ కొన్ని విషయాలను పంచుకున్నారు. ఖడ్గం సినిమా విడుదలయ్యాక తనని ఎక్కడ చంపెస్తారో అని కృష్ణవంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఆ సమయంలో ఆయనకు అండగా నిలబడటానికి పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా రాలేదని సిరివెన్నెల చెప్పుకొచ్చాడు.
యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో చాలా మంది చనిపోయారు. ఆ సంఘటన అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కృష్ణవంశీని బాగా కదిలించింది. దీని ఆధారంగానే ఆయన ఖడ్గం మూవీని తెరకెక్కించారు . నక్సలైట్ల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన సింధూరం తర్వాత వెంటనే ఈ కథని చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో చేద్దామని అనుకున్నారట. కానీ వాళ్ళతో అయితే కమర్షియల్ హంగులు, మార్కెట్, బడ్జెట్ వంటి అంశాలు అడ్డు వస్తాయని శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్‌లతో చేశారట కృష్ణవంశీ.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు