ఫెర్నాండెజ్ మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానంటున్న కృష్ణంరాజు..!
- January 29, 2019 / 01:01 PM ISTByFilmy Focus
కేంద్ర మాజీ మంత్రి, ప్రజా పోరాట యోధుడైన జార్జ్ ఫెర్నాండెజ్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జార్జ్ ఫెర్నాండెజ్ .. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్ వివిధ శాఖలకు మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారాయన. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
- మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక తాజాగా ‘జార్జి ఫెర్నాండెజ్’ మృతి పై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు అయిన కృష్ణంరాజు స్పందించారు. కృష్ణంరాజు మాట్లాడుతూ… “ఫెర్నాండెజ్ నాకు గురుసమానులు…. ఆయన మరణం నన్నుతీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అందులోనూ… ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఇక ఆయన మరణం దేశానికి తీరని లోటు… ఫెర్నాండెజ్ కుటుంబ సభ్యులకు.. నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అంటూ కృష్ణంరాజు తన ఆవేదనని వ్యక్తం చేసారు.

















