ప్రభాస్‌ పెళ్లిపై ఈసారి కృష్ణంరాజు వెరైటీ జవాబు

బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌… టాలీవుడ్‌లో ప్రభాస్. ఇదేదో కలెక్షన్ల గురించో, కండల గురించో కాదు… మూడు ముళ్ల బంధం గురించి. చాలా రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. దీనికి ఫుల్‌ స్టాప్‌ పడితే బాగుండు… మా ప్రభాస్‌ ఓ ఇంటివాడైతే బాగుండు అంటూ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాబిలర్స్‌ అందరూ పెళ్లి చేసుకొని సెటిలై పోతున్నారు. మిగిలిన ఒకరిద్దరు కూడా రేపో మాపో అన్నట్లుగా ఉన్నారు. కానీ ప్రభాస్‌ నుంచి ఇంకా సరైన స్పందన రావడం లేదు. దీని గురించి ఇటీవల కృష్ణంరాజు చేసిన కామెంట్స్‌ ఇంకొంచెం కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయి.

ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌ బాహుబలి ముందు నుంచి జరుగుతూనే ఉంది. ఆ టైమ్‌లో అడిగితే ‘బాహుబలి’ మొదటిపార్ట్‌ తర్వాత అన్నారు… తీరా చూస్తే కాలేదు. పోనీలో ‘కట్టప్ప’ టాపిక్‌ అయ్యాక చేసుకుంటాడేమో అనుకున్నాం.. కాలేదు. తర్వాత వరుస సినిమాలు వస్తున్నాయి.. పెళ్లి ముచ్చట రాలేదు. కరోనా టైమ్‌లో చాలామంది హీరోలు ఓ ఇంటివారైపోయారు. ప్రభాస్‌ కూడా ‘ఊ..’ అంటాడేమో అనుకున్నారు. కాలేదు. ఆ మధ్య ఈమె ప్రభాస్‌ కాబోయే భార్య అని కొన్ని ఫొటోలు కూడా వచ్చాయి. అవన్నీ అలా వెళ్లిపోయాయి. అయితే ఇటీవల ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు దగ్గర కొంతమంది ‘ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌’ తెచ్చారట. దానికి ఆయన కూల్‌గా ‘అయినప్పుడు చూద్దాం’ అన్నారట.

‘‘ప్రభాస్‌కి అమ్మాయిని చూస్తున్నాం. ఓకే అయితే పెళ్లి చేసేస్తాం’’ అని ఆ మధ్య కృష్ణంరాజు అన్నట్టు గుర్తు. ఇప్పుడు అడిగితే ఆ విషయం అప్‌డేట్‌ తెలుస్తుందేమో అనుకుంటే… ఇలా ‘చూద్దాం’ అనేసరికి రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. అక్కడితో పెద్దాయన ఆగకుండా ‘ఆ పెళ్లి గురించి అభిమానులతో పాటు మేమూ ఎదురు చూస్తున్నాం’ అని కూడా అన్నారు. ఇదంతా చూస్తుంటే పెళ్లి విషయంలో ప్రభాస్‌ పెదనాన్న మాట వినడం లేదేమో అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. ఏం చేస్తాం. ప్రభాస్‌కు ఆ ఆలోచన వచ్చేంతవరకు వేచిచూడాల్సిందే. అభిమానులైనా మనమైనా.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus