స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కెరీర్ పరంగా వరుస విజయాలు సాధిస్తుండగా ప్రభాస్ పెళ్లి విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త వినాలని అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ తన పెళ్లి గురించి మీడియా ముందు స్పందించిన సందర్భాలు అయితే లేవనే సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ పెద్దమ్మ స్పందించి క్లారిటీ ఇచ్చారు. మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ప్రభాస్ విషయంలో రుజువైందని శ్యామలాదేవి తెలిపారు.
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కు సక్సెస్ దక్కదని కొంతమంది అన్నారని ఆమె కామెంట్లు చేశారు. కానీ వాళ్ల అంచనాలు తారుమారు అయ్యాయని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెళ్లి విషయంలో కూడా అంతేనని శ్యామలాదేవి కామెంట్స్ చేశారు. కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఆశించిన విధంగా తన సినిమాలు ఉండాలని ప్రభాస్ శ్రమిస్తున్నారని శ్యామలాదేవి వెల్లడించారు. తాను తీసుకున్న బాధ్యతలకు సంబంధించి దృష్టి మరలకుండా పని చేస్తున్న గొప్ప వ్యక్తి ప్రభాస్ అని ఆమె పేర్కొన్నారు.
ప్రభాస్ కు పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుందని అయితే అందుకు సమయం రావాలని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెళ్లి విషయంలో నమ్మకంతోనే ఉన్నామని ఆమె వెల్లడించారు. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు కృష్ణంరాజు గారు ఆశించినవన్నీ జరిగాయని అదే విధంగా పెళ్లి కూడా జరుగుతుందని శ్యామలాదేవి వెల్లడించారు.
శ్యామలాదేవి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన తీపికబురును చెబుతారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. స్టార్ హీరో ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.