అదిగో పులి అంటే ఇదిగో తోక.. ఈ సామెత ఎక్కడైనా విన్నారా? మాకు తెలిసి వినే ఉంటారు. అయితే ఇలా ప్రవర్తించే వ్యక్తుల్ని ఇప్పుడు మీరు అర్జెంట్‌గా చూడాలి అంటే నెటిజన్లను చూస్తే సరి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాక్ స్వాతంత్ర్యపు హక్కు అనే పేరుతో ఎవరి గురించి పడితే వారి గురించి ఏదేదో మాట్లాడేవాళ్లను చూడండి. పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఏం జరిగింది అనే విషయంలో ఏ మాత్రం క్లూ లేకపోయినా ఏదో అయిపోయిందని రాసేస్తుంటారు వాళ్ల సోషల్ మీడియా వాల్స్ మీద.
ఏంటీ ఆవేశం.. ఏమైందని అనుకుంటున్నారా? మొన్నీమధ్యే ఏడేళ్ల ప్రేమాయణాన్ని వివాహ బంధంగా మార్చుకున్న సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) – జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) గురించే. ఆమెను ఎంతగా ఇబ్బంది పెట్టారు అంటే.. ఆమె రీసెంట్‌గా చేసిన కామెంట్సే దానికి ఉదాహరణ. కొన్నిరోజులుగా సోనాక్షి సిన్హాపై వస్తోన్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై తాజాగా స్పందించింది. ఈ క్రమంలో స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చింది అని చెప్పాలి.
పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇప్పుడూ అలానే ఉన్నాను అంటూ తమ రిలేషన్‌షిప్ గురించి చెప్పింది సోనాక్షి. అయితే ఇకపై తాము హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకోవడం లేదు అని ఆమె చెప్పింది. ఎందుకు, ఏమైంది అని అడిగితే.. మేము హాస్పిటల్ దగ్గర కనిపిస్తే ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు. అందుకే మళ్లీ అలాంటి మాట అనకుండా చూసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసింది సోనాక్షి.
పెళ్లి అయిన వెంటనే సోనాక్షి, జహీర్.. ఆసుపత్రి బయట కనిపించారు. వాళ్లను వెంబడించిన కెమెరాలు క్లిక్ మనిపిస్తే.. ఆ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లు ఏదేదో రాసేశారు. అయితే అక్కడ జరిగింది వేరే విషయం. సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆయన చికిత్స తీసుకుంటుండటంతో పరామర్శించడానికి సోనాక్షి అక్కడకు వెళ్లింది.
విషయం తెలియని వాళ్లు ఆమె గర్భవతేమో అంటూ రూమర్స్ ప్రారంభించారు. ఏమన్నా అంటే బాలీవుడ్ తారలు ఇలా పెళ్లి కాకుండానే గర్భవతులు అవుతున్నారని, ఆ తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారనే ఉదాహరణలు చూపించారు. అయితే ఇప్పుడు సోనాక్షి ఇచ్చిన రిటార్ట్‌తో కొంతైనా మారుతారేమో చూడాలి. ఇక్కడో అదృష్టం ఏంటంటే మన దగ్గర అలాంటి నెటిజన్లు లేరు.