Krishnamma OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి వచ్చేస్తున్న ‘కృష్ణమ్మ’

  • May 16, 2024 / 10:06 PM IST

సత్యదేవ్ (Satyadev) హీరోగా రూపొందిన ‘కృష్ణమ్మ’ (Krishnamma)  సినిమా ఇటీవల అంటే మే 10న రిలీజ్ అయ్యింది. కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో ‘అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కొన్నేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. అంటే 2007లో చోటు చేసుకున్న ఆయేషా అనే ఓ మైనర్ బాలిక హత్య ఉదంతం నేపథ్యంలో వి.వి.గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే మొదటి షోతో ఈ సినిమా యావరేజ్ రిపోర్ట్స్ ను మాత్రమే రాబట్టుకుంది.

అలా అని బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ చెప్పుకునే విధంగా కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. వీకెండ్ వరకు ఓకే అనిపించినా.. తర్వాత చేతులెత్తేసింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బ్రాండ్ కూడా ఈ సినిమాకి టికెట్లు తెగడానికి ఉపయోగ పడలేదు. థియేట్రికల్ రన్ ఈ వీకెండ్ తో ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇంకా ‘కృష్ణమ్మ’ థియేట్రికల్ రన్ కంప్లీట్ కాకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయినట్టు ఇన్సైడ్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం..

‘కృష్ణమ్మ’ సినిమా మే 17 లేదా మే 19 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అంటే రిలీజ్ అయిన వారం రోజులకే ఓటీటీకి వచ్చేస్తున్నట్టు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే.. కొన్ని నోటెడ్ సినిమాలు కనీసం 5 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ కావాలి. ఆ రూల్ ని బ్రేక్ చేసి ‘సలార్’ (Salaar) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి సినిమాలు 5 వారాల్లోపే ఓటీటీకి వచ్చేశాయి. కాబట్టి ‘కృష్ణమ్మ’ ఓటీటీకి వారంలో వచ్చేసినా పెద్దగా ఇండస్ట్రీ జనాలు పట్టించుకోకపోవచ్చు.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus