“కృష్ణార్జున యుద్ధం” ఫస్ట్ డే కలక్షన్స్.!

  • April 14, 2018 / 05:44 AM IST

యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన “కృష్ణార్జున యుద్ధం” నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఇందులో ఒక సామాన్య యువకుడిగా, సింగర్ గా నాని ఆకట్టుకున్నారు. వీరి పక్కన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు హీరోయిన్స్ గా మంచి మార్కులు కొట్టేశారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా అందించిన సంగీతం ప్లస్ అయింది. ఈ చిత్రం తొలిరోజు (krishnarjuna yuddham 1st day collection) ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 6 కోట్ల షేర్ రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 4.56 కోట్ల షేర్ ను అందుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో “కృష్ణార్జున యుద్ధం” సాధించిన వసూళ్లు.. ఏరియాల వారీగా కోట్లలో..

ఏరియా వసూళ్లు

నైజాం : 1.90
సీడెడ్ : 0.50

ఉత్తరాంధ్ర : 0.52
గుంటూరు : 0.53

కృష్ణ : 0.28
తూర్పు గోదావరి : 0.34

పశ్చిమ గోదావరి : 0.29
నెల్లూరు : 0.20

మొత్తం : 4.56

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus