‘రంగస్థలం’ కలెక్షన్స్ కి ‘కృష్ణార్జున యుద్ధం’ గండి కొడుతుందా

  • April 11, 2018 / 10:09 AM IST

‘రంగస్థలం’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం ఆ సినిమా తర్వాత మరో హిట్ రేంజ్ సినిమా విడుదలవ్వకపోవడంతో.. గత రెండు వారాలుగా రామ్ చరణ్ బాక్సాఫీస్ పై ఏకఛత్రాధిపత్యం చేస్తున్నాడు. గతవారం విడుదలైన నితిన్ “చల్ మోహన్ రంగ” ఆశించిన స్థాయిలో అలరించలేకపోవడంతో అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే.. ఈవారం విడుదలవుతున్న నాని “కృష్ణార్జున యుద్ధం” మాత్రం “రంగస్థలం” బాక్సాఫీస్ కలెక్షన్స్ కి గండి కొట్టేలా ఉందని తెలుస్తోంది.

అసలే వరుస విజయాలతో మాంచి దూకుడు మీదున్న నాని సినిమా కావడం, అందులోనూ నాని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం, “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా” చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొన్న మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో “కృష్ణార్జున యుద్ధం” సినిమాపై విశేషమైన అంచనాలున్నాయి. మరి ఆ భారీ అంచనాలను అందుకొని “కృష్ణార్జున యుద్ధం” బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తుందా లేక చరణ్ కి సైడ్ ఇచ్చేసి సైడ్ అయిపోతుందా అనేది చూడాలి.

అలాగే.. మరో వారంలో “భరత్ అనే నేను” అంటూ వస్తున్న మహేష్ బాబు చరణ్-నాని ఇద్దరినీ కలిపి ఎఫెక్ట్ చేయనున్నాడు. అయితే.. వారానికొక సినిమా రావడం కామనే కాబట్టి.. విడుదలైన మొదటి రెండుమూడు రోజులు ఈ ఎఫెక్ట్ ఉన్నా కూడా తర్వాత అది తగ్గి అన్నీ సినిమాలకు సమానమైన కలెక్షన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus