‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిన కృతి శెట్టి, ఆ తర్వాత వరుస ఫ్లాపులతో అంతే వేగంగా కిందకు పడింది. ‘ది వారియర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్టడీ’.. ఇలా తెలుగులో ఆమె చేసినవన్నీ డిజాస్టర్లే. దీంతో ఆమెకు ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర బలంగా పడింది. ఈ ట్యాగ్ దెబ్బకు తెలుగులో అవకాశాలు పూర్తిగా ఆగిపోయాయి.
ఈ ముద్రను చెరిపేసుకోవడానికి మాలీవుడ్ (‘ARM’ 100 కోట్లు) వైపు వెళ్లినా, ఆ హిట్ ఆమెకు అక్కడ కొత్త అవకాశాలు తెచ్చిపెట్టలేదు. అందుకే, ఇప్పుడు తన ఫోకస్ మొత్తం కోలీవుడ్‌పై పెట్టింది. అక్కడ ఆమె పక్కా స్ట్రాటజీతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఆ స్ట్రాటజీలో భాగమే ‘లవ్ ఇన్సూరెన్స్’ సినిమా. కోలీవుడ్‌లో ప్రస్తుతం యూత్‌కు బాగా కనెక్ట్ అయిన, ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో ‘హ్యాట్రిక్ స్టార్’ స్టేటస్ పొందిన ప్రదీప్ రంగనాథన్‌తో ఆమె జతకట్టింది. ప్రదీప్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా హిట్టయితే, ఆ సక్సెస్ క్రెడిట్ ప్రదీప్‌తో పాటు కృతికి కూడా వస్తుంది.
ఇది ఒక్కటే కాదు, ఆమె ఆశలన్నీ వచ్చే నెల (డిసెంబర్) మీదే ఉన్నాయి. ఇదే నెలలో కార్తీ లాంటి స్టార్ హీరోతో చేసిన ‘వా వాత్తయార్’ కూడా రిలీజ్ కానుంది. ‘లవ్ ఇన్సూరెన్స్’, ‘వా వాత్తయార్’.. ఈ రెండు పెద్ద సినిమాలు కేవలం కొద్ది వారాల గ్యాప్‌లో రాబోతున్నాయి.
ఈ రెండు చిత్రాల ఫలితాలు కృతి శెట్టి ఫేట్‌ను డిసైడ్ చేయనున్నాయి. ఇవి గనక హిట్టయితే, కోలీవుడ్‌లో స్టార్ లీగ్‌లోకి వెళ్లడమే కాదు, అదే హిట్‌తో తెలుగులో తనపై ఉన్న ‘ఐరన్ లెగ్’ ముద్రను కూడా చెరిపేసుకోవచ్చు. అప్పుడు, ఇక్కడ తిరిగి బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.