Krithi Shetty: తమ్ముడికి యస్ చెప్పిన బేబమ్మ.. అన్నకు మాత్రం..?

సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలలో నటించాలంటే హీరోయిన్లు తెగ ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. మెగా హీరో సినిమాలో నటించి సక్సెస్ సాధిస్తే మెగా ఫ్యామిలీలోని మిగతా హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఉప్పెన సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తో కలిసి నటించిన కృతిశెట్టి సాయిధరమ్ తేజ్ సినిమాలో నటించడానికి మాత్రం నో చెప్పారని సమాచారం. ఉప్పెన సినిమా సక్సెస్ తో కృతిశెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారు.

స్టార్ హీరోలు కృతిశెట్టిని పట్టించుకోకపోయినా మిడిల్ రేంజ్ హీరోలు, యంగ్ హీరోలు కృతిశెట్టి తమ సినిమాలలో నటిస్తే సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కృతిశెట్టి 60 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటుండగా 60 లక్షల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. కొన్ని రోజుల క్రితం దగ్గుబాటి అభిరామ్ సినిమాను కృతిశెట్టి రిజెక్ట్ చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను కృతిశెట్టి ఖండించారు.

బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా కార్తీక్ అనే కొత్త దర్శకుని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ను కృతిశెట్టి రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కృతిశెట్టి తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లే కృతిశెట్టి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. తమ్ముడికి యస్ చెప్పిన బేబమ్మ అన్నకు మాత్రం నో చెప్పినట్టు ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus