Krithi Shetty: ఆ స్టార్ హీరోయిన్ ను ఫిక్స్ చేద్దామనుకుంటే కృతి శెట్టి ఎంటర్ అయ్యిందట..!

సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ‘బంగార్రాజు’.. అటు నాగార్జున కెరీర్లోనూ ఇటు నాగ చైతన్య కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే నిలబడింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది కాబట్టి.. దాని క్రేజ్ కూడా ఈ చిత్రానికి హెల్ప్ అయ్యింది.

‘బంగార్రాజు’ గా మరో పక్క రాముగా నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకోగా.. ‘బంగార్రాజు’ మనవడు చిన్న బంగార్రాజుగా చైతన్య తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. అతనికి జోడీగా ఈ చిత్రంలో కృతి శెట్టి నటించింది. సర్పంచ్ నాగ లక్ష్మీగా ఆమె ఈ చిత్రంలో కనిపించింది. మొదటిసారి ఆమె ఈ చిత్రంలో కామెడీ కూడా ట్రై చేసింది. లంగా వోణి, చీరల్లో ఆమె లుక్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంతో కృతి .. హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసింది. నిజానికి ఈ పాత్రకి వేరే హీరోయిన్ వద్దకు వెళ్ళాల్సిందట. అయితే చివర్లో కృతి ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ‘ఉప్పెన’ షూటింగ్ టైములో ‘బంగార్రాజు’ టీం కృతిని సంప్రదించారట. అయితే అప్పటికే ఆమె మరో రెండు సినిమాలకి కమిట్ అవ్వడం.. డేట్స్ ఇష్యు తలెత్తుతుందేమో అని భావించి.. కృతి శెట్టి నొ చెప్పిందట.

దీంతో రష్మికని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ‘బంగార్రాజు’. అయితే అదే టైంకి కృతి అండ్ టీం డేట్స్ అడ్జస్ట్ చేస్తామని వెనక్కి వచ్చి ఈ ప్రాజెక్టుని ఓకె చేసిందట. ఇదే పాత్రని రష్మిక కనుక చేసి ఉంటే.. రెస్పాన్స్ ఎలా ఉండేదో..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus