Kriti Sanon: ‘ఆదిపురుష్‌’ కోసం ‘సీత’ కృతి సనన్‌ ఏం చేసిందో చూశారా? ఇలా అందరూ చేస్తే!

భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాగా మొదలై, పూర్తి చేసుకొని.. తీరా టీజర్‌ వచ్చాక నానా మాటలు పడ్డ చిత్రం ‘ఆదిపురుష్‌’. కాస్త కుదురుకుని సినిమా తీసుకొస్తున్నారు అనుకుంటే.. టీజర్‌ వచ్చినప్పుడు వచ్చిన విమర్శలు కంటే సినిమా వచ్చాక చాలా వచ్చాయి. వందల కోట్ల రూపాయల వసూళ్లు వస్తున్నా… అంతకుమించి అనే రీతిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ఈ సినిమాను ఉచితంగా చూపించే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా సినిమా నాయిక కృతి సనన్‌ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది.

జూన్ 16న విడుదలైన ‘ఆదిపురుష్‌’ సుమారు రూ. 400 కోట్లు వసూలు చేసింది. అయితే సినిమా బడ్జెట్‌కు అవి ఏమాత్రం సరిపోవు అనేది పరిశీలకుల మాట. అయితే సోమవారం నుంచి డ్రాప్ అయిన వసూళ్లు ఇప్పుడు ఇంకా పడిపోతున్నాయి. అయితే మరోవైపు ఉచిత ప్రదర్శనలు, ఉచిత టికెట్ల కార్యక్రమం జరుగుతోంది. అలా కృతి సనన్‌ కూడా ఓ మల్టిప్లెక్స్‌ స్క్రీన్‌ను ఓ షో కోసం తీసుకుందట. సినిమాలో జానకి పాత్రలో కృతి సనన్ నటనకు మంచి పేరొచ్చింది.

ఈ క్రమంలోనే కృతి సనన్ తన ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు, తాను చదువుకున్న స్కూల్లోని పిల్లలందరికీ సినిమా చూపించినట్లు వార్తలొస్తున్నాయి. ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్‌లో ఓ స్క్రీన్‌లో షో కోసం టికెట్స్ బుక్ చేసినట్లు సమాచారం. అందులో తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలందరికీ ‘ఆదిపురుష్’ స్క్రీనింగ్ వేయించిందట. వాళ్లతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా హాజరైనట్లు భోగట్టా. కృతి సనన్ బుక్ చేసిన స్క్రీన్‌లో సుమారు 300 మంది సినిమా చూసే వీలు ఉందట.

కృతికి (Kriti Sanon) తాను చదువుకున్న స్కూలుతో మంచి బాండింగ్ ఉంది. గతంలో తన ‘బేడియా’ సినిమాని అక్కడ ప్రమోట్ చేసింది కూడా. ఇటీవల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతి సోషల్ మీడియాలో స్కూల్ టీమ్‌ని అభినందిస్తూ పోస్ట్‌ చేసింది. అయితే ఆమె ఇంకా సినిమా షో వేయలేదని, త్వరలో వేయిస్తుందని కూడా అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus