Kriti Sanon: బరువైన పాత్ర తనపై ఉన్నందుకు బాధ్యతగా భావించా: కృతి సనన్

కృతి సనన్ తెలుగులో ఈమె సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో అందచందాలను ఆరబోసిన ఈమెకు సరైన గుర్తింపు రాలేదు.ఇలా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను సందడి చేయలేకపోయిన ఈమె తన రెండవ చిత్రాన్ని అక్కినేని వారసుడు నాగచైతన్య సరసన నటించారు. ఈ సినిమా కూడా తనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇలా తెలుగులో పెద్దగా ఆదరణ పొందకపోవడంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించడమే కాకుండా ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కృతి సనన్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా గురించి నటి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందులో తాను సీత పాత్రలో నటించానని అయితే హిందూ ధర్మ శాస్త్రంలో, సమాజంలో గౌరవనీయ స్థానంలో ఉండి, పూజలు అందుకుంటున్న సీతమ్మ పాత్రలో నటించడానికి ముందు కాస్త నెర్వస్ గా ఫీలయ్యాను. అదేవిధంగా బరువైన పాత్ర తనపై ఉన్నందుకు బాధ్యతగా చేశానని ఈమె తెలిపారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఏకంగా 500 కోట్లు బడ్జెట్ తో నిర్పిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని టి సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus