స్త్రీ సినిమా కోసం కృతి చేసిన సాంగ్ సూపర్ హిట్

మహేష్ బాబు సరసన “ఒన్ నేనుక్కడినే” చిత్రంతో కథానాయికగా పరిచయమై.. అనంతరం నాగచైతన్యతో కలిసి “దోచేయ్” చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన హాట్ & హైట్ బ్యూటీ కృతి సనన్ గుర్తుంది కదా. అమ్మడు తెలుగులో మళ్ళీ కనిపించకపోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అమ్మడు రీసెంట్ గా “స్త్రీ” అనే సినిమా కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్ వైరల్ అయ్యింది. ప్రమోషనల్ సాంగ్ వైరల్ అవ్వడంలో పెద్ద విశేషం ఏముంది? అందాలు ఆరబోసి ఉంటుంది కదా అని సింపుల్ గా ఒక కంక్లూజన్ కి వచ్చేయకండి. ఇక్కడ వైరల్ అయ్యింది పాట మాత్రమే కాదు.. ఆ పాటలో అమ్మడి రొమాన్స్. ఆ రొమాన్స్ చేసింది ఎవరైనా హీరో లేదా కనీసం జూనియర్ ఆర్టిస్ట్/మోడల్ తో అయితే మనం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చదవాల్సినవసరం కూడా ఉండేది కాదు.

ఈ స్పెషల్ సాంగ్ లో విశేషం ఏంటంటే.. ఈ పాటలో కృతి రొమాన్స్ చేసేది ఒక అస్తిపంజరంతో. షాక్ అయ్యారు కదా.. కానీ ఇది నిజం. కావాలంటే మీరు ఆ వీడియో సాంగ్ ను ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పాట పుణ్యమా అని స్త్రీ మీద హైప్ పెరుగుతోంది. ఇలా నడుముతో మేజిక్ చేయటం కేవలం కత్రినా కైఫ్ దీపికా పదుకునే లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమని ఇప్పుడు కృతి ఈ లిస్ట్ లో చేరిపోయిందని నెటిజెన్లు ప్రశంశల వర్థం కురిపిస్తున్నారు. కృతికి ఇదంతా బాగానే ఉంది కానీ పాపం హీరోయిన్ గానే సరైన బ్రేక్ దొరకడం లేదు. మరి ఈ పాట పుణ్యమా అని వచ్చిన క్రేజ్ తో అమ్మడికి ఏమైనా మంచి సినిమా పడితే కచ్చితంగా దీపికా, కత్రినాల స్థాయికి ఎదగడం మాత్రం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus