Kriti Sanon: హీరోయిన్ల కాస్మొటిక్‌ సర్జరీలపై కృతి సనన్‌ షాకింగ్ కామెంట్స్‌!

Advertisement

గత కొన్ని రోజులుగా మీడియాలో కృతి సనన్‌ (Kriti Sanon) పేరు తెగ వినిపిస్తోంది. కారణం ఆమె రెండు పాత్రల్లో నటించి, నిర్మించిన ‘దో పత్తి’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమాను రిలీజ్‌ చేసి మంచి పేరు సంపాదిచుకుంది. ఈ సినిమా ప్రచారం కోసం ఆమె వరుసగా మాట్లాడుతూనే ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ల కాస్మోటిక్‌ సర్జరీలు చేయించుకోవడంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.మహిళలు అందంగా కనిపించాలని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు.

Kriti Sanon

అందంగా కనిపించడం కోసం శరీర భాగాలకు సర్జరీలు చేయించుకునే వారి గురించి నేను వ్యాఖ్యానించలేను. ఎందుకంటే ఆ నిర్ణయం అది పూర్తిగా వారి సొంత నిర్ణయం. శరీరంలో ఒక భాగంలో మార్పు వచ్చినంత మాత్రాన అందంగా కనిపిస్తామని నమ్మకం ఉంటే చేయించుకోవచ్చు అని కృతి సనన్‌ వ్యాఖ్యానించింది. అయితే కాస్మొటిక్‌ సర్జరీ నిర్ణయం వల్ల వచ్చే సమస్యలను వాళ్లే ఎదుర్కోవాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. తన వరకు చూస్తే అందం విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు.

మానసికంగా ఆనందంగా ఉంటే ఆ భావన మన ముఖంలోనే కనిపిస్తుందని చెప్పిన కృతి.. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తా అని తెలిపింది. అందుకే తాను తీసుకునే ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినప్పుడు ఫిల్టర్లు వాడను అని చెప్పింది. ఈ ఏడాది ఇప్పటికే థియేటర్లలో రెండు సినిమాలతో వచ్చింది కృతి సనన్‌.

తొలి సినిమా ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ కాగా, రెండో సినిమా ‘క్రూ’ (Crew). తొలి సినిమా ఓ మోస్తరు విజయం సాధించగా.. రెండో సినిమా మాత్రం అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘దో పత్తి’తో హ్యాట్రిక్‌ విజయం అందుకుంది కృతి. ఈ సినిమా తర్వాత కొత్త సినిమాలేవీ ఆమె అంగీకరించలేదు. త్వరలోనే కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు ఉంటాయి అని చెబుతున్నారు.

అమలా పాల్ బోల్డ్ లుక్.. ఇలా షాక్ ఇచ్చిందేంటీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus