Kshanam Collections: ‘క్షణం’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

అప్పటివరకు విలక్షణమైన పాత్రలు చేస్తూ వచ్చిన అడివి శేష్ (Adivi Sesh).. హీరోగా మారి కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో చేసిన ‘కర్మ’ ‘కిస్’ (Kiss) వంటి సినిమాలు వర్కౌట్ కాలేదు. ఇలాంటి టైంలో ‘క్షణం’ (Kshanam) చేశాడు. ‘పీవీపీ సినిమా’ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) డైరెక్ట్ చేశారు. పెద్దగా అంచనాలు లేకుండా 2016 ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు ఈ సినిమాకి జనాలు లేరు.

Kshanam Collections:

కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో కలెక్షన్స్ పెరిగాయి. తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్ అయ్యింది. అయితే నేటితో ‘క్షణం’ రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.65 cr
సీడెడ్ 1.55 cr
ఉత్తరాంధ్ర 1.65 cr
ఈస్ట్ 0.65 cr
వెస్ట్ 0.50 cr
గుంటూరు 0.85 cr
కృష్ణా 0.79 cr
నెల్లూరు 0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.99 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.20 cr
తెలుగు వెర్షన్ (టోటల్) 10.19 cr

‘క్షణం’ (Kshanam) సినిమా రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.10.19 కోట్ల షేర్ ను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కి రూ.6.19 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

 సీక్వెల్ అంటూ బాలయ్య ఏళ్లు గడిపేస్తున్నారు.. ఇప్పుడు ఆ సినిమా రీరిలీజ్‌!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus