తుదిదశలో చిత్రీకరణను జరుపుకుంటున్న ‘క్షణం’

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది.  మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్  బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం’. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు.

హీరో ఓ కేసు చేదించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమి చేశాడనేదే ప్రధాన కథాంశం2015లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నామినేట్ అయిన అమెరికన్ సినిమాటోగ్రాపర్ షానియెల్ డియో సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు.  అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus