పదేపదే నగ్నంగా నటించాలని అడిగారని విమర్శలు చేసిన కుబ్రా సైత్!

వెండితెరపై మనల్ని అలరించే నటీనటుల కష్టం మాటల్లో వర్ణించలేనిది. హీరోలు అత్యంత సాహసాలు చేయడానికి ప్రాణాలకు తెగిస్తీ… సిగ్గుతో ప్రాణం పోతున్నట్టు అనిపించినా.. అందరి ముందు పొట్టి దుస్తుల్లో కనిపించాల్సి ఉంటుంది. ఈ మధ్య సినిమాల్లో నగ్నంగా నటించాల్సి కూడా వస్తోంది. అందుకు కూడా సై అంటున్నారు కొందరు. అలాంటి వారిలో కుబ్రా సైత్ ఒకరు. ఆమె “స్కెర్డ్ గేమ్స్” పేరిట నిర్మితమైన వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా కనిపించింది. అందుకోసం నగ్నంగా నటించాల్సి వచ్చింది. అయితే అది ఆమెకు కన్నీటిని మిగిల్చింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన విమర్శలు చేసింది. సీన్ బాగా రాలేదంటూ, తనను మరోసారి న్యూడ్ గా కనిపించాలని చెబుతూ పదే పదే ఆయన కోరాడని, దీంతో తనకు ఏడుపు వచ్చిందని వాపోయింది.

“నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసు. సీన్ మరింత బాగా రావాలంటే, మరోసారి న్యూడ్ గా కనిపించాలి. అలా చేయాల్సిందే. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ వెబ్ సిరీస్ బయటకు వచ్చాక, నన్ను అందంగా తీశారని అంటావు” అని కశ్యప్ తనతో చెప్పేవారని తెలిపింది. అయితే, పదేపదే నగ్న దృశ్యాలు తీస్తుండటం, షాట్ మీద షాట్ అలాగే నటించాల్సి రావడంతో తాను చాలాసార్లు ఏడ్చానని చెప్పింది.  దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ముంబైలో గ్యాంగ్ స్టర్స్, పోలీసుల మధ్య దాడులు, ఎన్ కౌంటర్ల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందుతుండగా, అలీఖాన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రాధికా ఆప్టే తదితరులు ఇందులో నటించారు. ఈ సిరీస్ ఈనెల 6 న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus