సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

ఇప్పుడు ఎవరి లైఫ్ కి గ్యారెంటీ లేకపోయింది. పేదవాళ్ళు అయినా గొప్ప వాళ్ళు అయినా ఎవరి జీవితాలు ఎప్పుడు ఈ భూమ్మీద ముగుస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈ మధ్య సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న విషాదాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.

Shefali Jariwala

కొన్నాళ్లుగా చూసుకుంటే మలయాళ నటుడు విష్ణు ప్రసాద్ (Vishnu Prasad), ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్ (Mukul Dev),తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్‌ టామ్‌ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను వంటి ఎంతో మంది నటీనటులు కన్నుమూశారు.

ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి, మోడల్ అయిన షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) మృతి చెందారు. ఆమె వయసు కేవలం 42 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో ముంబైలో ఆమె నివాసముంటున్న ఇంట్లోనే కన్నుమూసినట్టు తెలుస్తుంది.

దీంతో ఆమె మరణ వార్త హిందీ చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. కొంతమంది ఫిలిం మేకర్స్ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.షెఫాలీ జరీవాలా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ‘ముజ్ సే షాదీ కరోగి’ ‘హుడుగురు'(కన్నడ) వంటి సినిమాల్లో నటించింది. అలాగే హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో ఓ కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.

నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus