Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Advertisement

ధనుష్- నాగార్జున- దర్శకుడు శేఖర్ కమ్ముల వంటి క్రేజీ కాంబినేషన్లో ‘కుబేర'(Kuberaa) అనే సినిమా రూపొందింది. రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషించింది.2025 జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

తమిళంలో మాత్రం ఈ సినిమా ఆడలేదు. కానీ తెలుగులో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. వంద కోట్ల క్లబ్లో కూడా చేరింది.ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 17.1 cr
సీడెడ్ 4.78 cr
ఉత్తరాంధ్ర 5.95 cr
ఈస్ట్ 2.87 cr
వెస్ట్ 1.69 cr
గుంటూరు 2.37 cr
కృష్ణా 2.45 cr
నెల్లూరు 1.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 38.55 cr
తమిళనాడు 10.73 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.90 Cr
ఓవర్సీస్ 16.75 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 72.93 cr(షేర్)

‘కుబేర’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.72.93 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.124.22 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.12.93 కోట్ల ప్రాఫిట్స్ ను బయ్యర్స్ కి అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus