Sanchita Ugale: యువ నటి మృతి
- June 15, 2026 / 03:42 PM ISTByPhani Kumar
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హిందీ సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ఫేమ్ సంచిత ఉగాలే(Sanchita Ugale) ఈరోజు మరణించడం అందరికీ షాక్ ఇచ్చింది. అందులోనూ ఆమె బలవన్మరణానికి పాల్పడటం అనేది మరింత షాక్ ఇచ్చే అంశం. సంచిత వయసు కేవలం 30 ఏళ్ళు మాత్రమే కావడం గమనార్హం. ముంబైలో ఉన్న ఆమె నివాసంలోనే సంచిత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలాన్ని పరీక్షించిన అనంతరం పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.
Sanchita Ugale

ఎవరూ లేని టైమ్ చూసుకుని సంచిత ఆత్మహత్య చేసుకున్నట్టు వారు నిర్దారించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సంచిత ఉరి వేసుకున్నట్టు గుర్తించి హాస్పిటల్ కు తరలించారట. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు చెప్పారట. ఈ వివరాలను ఆదారం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
సంచిత ఉగాలే చాలా సీరియల్స్ లో నటించింది. ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సీరియల్స్ క్రేజ్ తోనే ఆమె ‘ఛావా’ ‘సైలెన్స్ 2’ వంటి బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు పొందింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నప్పటికీ 30 ఏళ్ల వయసులోనే ఈ యువ నటి మృతి చెందడం అనేది… ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే కాదు యావత్ సినీ పరిశ్రమని విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది.
కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్ రివ్యూ












