“భరత్ అనే నేను” బహిరంగ సభలో మహేష్ బాబు అన్నట్లు “మేం మేం బాగానే ఉన్నాం, మీరు బాగుండాలి” అనే మాట ఎందుకన్నాడో అప్పుడప్పుడూ మనకి అర్ధమవుతునే ఉంటుంది. ఒక్కోసారి హీరోలకంటే ఎక్కువగా వాళ్ళ అభిమానులే ఎక్కువగా ఫీల్ అవ్వడంతోపాటు హడావుడి కూడా చేస్తుంటారు. నిన్నమొన్నటివరకూ తమిళ హీరోల అభిమానులు మాత్రమే ఇలా చేస్తారనుకొంటే.. ఈమధ్య తెలుగు హీరోల అభిమానులు కూడా మొదలెట్టారు. అందుకు కత్తి మహేష్ ఇష్యూ పెద్ద ఉదాహరణ.
ఇప్పుడు ఈ జాబితాలో ఖుష్బూ చేరే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ సీనియర్ హీరోయిన్ అప్పుడప్పుడూ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటుంది. అలా నిన్న సాయంత్రం ఆవిడ కొందరు హీరోల గురించి రెస్పాండ్ అవుతూ ఒక్కో హీరో గురించి ఒక్కోరకంగా పొగుడుతూ పోస్ట్స్ చేయగా.. మహేష్ బాబు గురించి అడగగా “నో ఐడియా” అని రిప్లై ఇవ్వడంతో మహేష్ అభిమానులు ఆమెపై సీరియస్ అయ్యారు. అయితే.. వెంటనే ఆయన మంచి మనిషి అని మరో రిప్లై ఇచ్చి తృటిలో ట్రోలింగ్ నుంచి తప్పించుకొంది.