విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘హృదయం'(మలయాళం) ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
టీజర్, ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ‘ఖుషి’ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ‘ఖుషి’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 12.20 cr |
సీడెడ్ | 5.20 cr |
ఉత్తరాంధ్ర | 3.80 cr |
ఈస్ట్ | 2.20 cr |
వెస్ట్ | 2.00 cr |
గుంటూరు | 2.90 cr |
కృష్ణా | 2.30 cr |
నెల్లూరు | 1.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 32.70 cr |
కర్ణాటక | 3.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.20 cr |
ఓవర్సీస్ | 5.50 cr |
తమిళ్ | 3.00 cr |
రెస్ట్ | 2.00cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 50.20 cr (షేర్) |
‘ఖుషి’ (Kushi) చిత్రానికి రూ.50.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!