L2 Empuraan Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ఎంపురాన్ ..!

2019 లో మలయాళంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’  (L2: Empuraan) రూపొందింది. మార్చి 27న ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ ను మూటగట్టుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు (Dil Raju)  రిలీజ్ చేశారు. దీంతో ఎక్కువ థియేటర్లు దక్కాయి. కానీ నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల తెలుగులో మంచి వసూళ్లు రాలేదు.

L2 Empuraan Collections:

మరోపక్క ఈ సినిమాలో కొంత కంటెంట్ వివాదాస్పదం అవ్వడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. దాని వల్ల చాలా సీన్లు కట్ చేశారు. దీంతో ఆడియన్స్ లో ఉన్న ఆ కాస్త ఇంట్రెస్ట్ కూడా సన్నగిల్లింది అని చెప్పాలి. ఒకసారి (L2 Empuraan) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.92 కోట్లు
సీడెడ్ 0.24 కోట్లు
ఆంధ్ర(టోటల్) 0.54 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్ (తెలుగు వెర్షన్)
0.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 1.90 కోట్లు(షేర్)

‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2 Empuraan) సినిమాకు రూ.5.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.9 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా కేవలం రూ.3.06 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మలయాళంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగులో అయితే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus