‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా గత వారం అంటే మార్చి 28న రిలీజ్ అయ్యింది. దీనికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కొంతమంది ‘లాజిక్ లెస్’ అంటూ నెగిటివ్ గా కూడా రాసుకొచ్చారు. దీంతో నిర్మాతకి నాగవంశీకి (Suryadevara Naga Vamsi) కోపం వచ్చింది.ఈ క్రమంలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియాపై ఆయన మండిపడ్డారు. నాగ వంశీ మాట్లాడుతూ.. ” ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ రోజున కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. కానీ అప్పుడు రివ్యూల గురించి నేను మాట్లాడలేదు.
ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది. నా జాబ్ నాది. ఫైనల్ గా సినిమాని జనాలు చూస్తున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. కానీ మీ రివ్యూలు కరెక్ట్ చేసుకోవడానికి.. సినిమాలో విషయం లేకపోయినా కలెక్షన్స్ బాగా వస్తున్నాయి అని.. మీ రివ్యూని కరెక్ట్ చేసుకోవడానికి ట్వీట్లు వేయడం, వంటివి కరెక్ట్ కాదు కదా. మీ ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ రన్ అవుతుంది. మేము సినిమాలు తీయడం వల్లే మీకు కంటెంట్ వస్తుంది. మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది.
మీ రివ్యూ గురించి మేము కామెంట్ చేయడం లేదు. కానీ సినిమా ఆడుతున్నప్పుడు, జనాలు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు అంతగా మా మీద పగ ఉంటే, దమ్ముంటే.. మా సినిమాని బ్యాన్ చేయండి, నా సినిమా మీద ఆర్టికల్స్ రాయకండి.నా దగ్గర యాడ్ తీసుకోకండి. నా సినిమాలపై రివ్యూలు రాయకండి. నేను ఓపెన్ గానే చెబుతున్నా. నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు. వెబ్ సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమా ఆడట్లేదు కదా” అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
నన్ను బ్యాన్ చేయండి.. కాకపోతే మా సినిమాని చంపకండి pic.twitter.com/tnQkbFqjLn
— Filmy Focus (@FilmyFocus) April 1, 2025
మేము సినిమా తీస్తేనే మీకు పని ఉంటుంది pic.twitter.com/smue7EZLOH
— Filmy Focus (@FilmyFocus) April 1, 2025