Vijay Devarakonda: ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ – రష్మిక

మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారా? అంటే ఏమాటా చెప్పరు. మీ మధ్య ఉన్నది స్నేహమా అంటే అంతకుమించి అంటారా? రిలేషన్‌లో ఉన్నారా అంటే.. ఈ వయసు వచ్చాక కూడా ఇంకా రిలేషన్‌లో లేకుండా ఉంటారా అని అంటారు. పోనీ ఎవరితో రిలేషన్‌లో ఉన్నావ్‌ అని అడిగితే సమాధానం ఉండదు. కానీ ఇద్దరూ కలసి తిరుగుతారు, కలసి కాకపోయినా ఒకే సమయంలో ఒకే చోట కనిపిస్తారు. కానీ ఏ విషయం చెప్పరు.

Vijay Devarakonda

ఇదంతా రౌడీ బోయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన  (Rashmika Mandanna)  గురించే అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ పని చేస్తోంది వాళ్లిద్దరు మాత్రమే. నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala), సిద్ధార్థ్‌  (Siddharth) – అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari)  కూడా ఈ పని చేసినా ఇప్పుడు వాళ్లు వెడ్డెడ్‌ కపుల్స్‌. విజయ్‌ – రష్మిక మాత్రమే కాదు. గతంలో ఓసారి ఒకే రెస్టరెంట్‌ దగ్గర ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఆ తర్వాత ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో లీకైంది. అంతకుముందు విదేశాలకు వేర్వేరుగా (?) వెళ్తూ కనిపించారు. ఆ ముందు విజయ్‌ ఇంటి లాన్‌లో డిఫరెంట్‌ టైమ్‌లో ఫొటోలు కనిపించాయి. ఇప్పుడు మరోసారి ముంబయిలో వీళ్లిద్దరూ ఒకే రెస్టారెంట్‌ దగ్గర కనిపించడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సల్మాన్‌ ఖాన్‌ – రష్మిక నటించిన ‘సికందర్’ (Sikandar) సినిమా విడుదల సందర్భంగా విజయ్‌ – రష్మిక కలిసి భోజనం చేయడానికి వెళ్లారు.

దీంతో వీరి బంధంపై మళ్లీ వార్తలు వచ్చాయి. తొలుత రెస్టారెంట్‌కి వచ్చిన రష్మిక మాస్క్ తీసి ఫొటోలకు, వీడియోలకు పోజులిచ్చింది. కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ మాస్క్, టోపీ ధరించి ఎవరికీ కనిపించకుండా రెస్టారెంట్ వెనుకవైపు నుండి వచ్చాడట. ఇదంతా చూస్తున్న జనం.. ఎందుకీ పీఆర్‌ స్టంట్స్‌.. ఏదో విషయం క్లియర్‌గా చెప్పేయొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు. చూద్దాం ఎప్పటికి అఫీషియల్‌ చేస్తారో?

రాంచరణ్ సినిమా పైరసీ.. నాగవంశీ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus