Laddunda Song: ఆకట్టుకుంటున్న ‘బంగార్రాజు’ ఫస్ట్ సింగిల్..!

  • November 9, 2021 / 12:12 PM IST

2015 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటికి నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజులకే సీక్వెల్ కూడా ఉంటుందని నాగార్జున ప్రకటించాడు. కానీ అది టేకాఫ్ అవ్వడానికి చాలా టైమే పట్టింది. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం.. 2022 సంక్రాంతి బరిలో నిలబడడానికి రెడీ అవుతుంది.

ఏకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ చిత్రం పక్కన విడుదల కావడానికి రెడీ అవుతుంది. అందుకోసమే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ శరవేగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేసారు. దీపావళి సందర్భంగా ఈ పాటకి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పాట ఆ అంచనాలను అందుకుందనే చెప్పాలి. ‘డాంటకు డడన… లడ్డుండ’ వంటి లిరిక్స్ తో ఈ పాట హుషారెత్తించే విధంగానే ఉంది.

భాస్కర్ బట్ల అందించిన లిరిక్స్… అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్ బాగున్నాయి. నాగార్జున, ధనుంజయ్ సీపాన, అనూప్ రూబెన్స్, నూతన మోహన్, మోహన భోగరాజు, హరిప్రియ వంటి వారు ఈ పాటని పాడడం విశేషం. స్వర్గంలో ఉన్న కన్యకలతో సోగ్గాడు పాడుకుంటున్న రొమాంటిక్ సాంగ్ ఇదని స్పష్టమవుతుంది. మీరు కూడా ఓ సారి వినండి :

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus