Balakrishna, Anil Ravipudi: బాలయ్యకు విలన్ గా తెలుగమ్మాయిని ఎంపిక చేశారా?

స్టార్ హీరో బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా అటు బాలయ్య ఖాతాలో ఇటు అనిల్ రావిపూడి ఖాతాలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అఖండ సక్సెస్ తో బాలయ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడి బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా ఎంపియ్యారని శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఈ సినిమాలో విలన్ రోల్ లో తెలుగమ్మాయి అంజలి కనిపించనున్నారని తెలుస్తోంది. అంజలి రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని బాలయ్యకు ధీటుగా ఉండేలా అనిల్ రావిపూడి ఈ రోల్ ను క్రియేట్ చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయని బోగట్టా. అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

బాలయ్య లైనప్ అద్భుతంగా ఉందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. వరుస సినిమాలతో బాలయ్య కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో బాలయ్య అనిల్ కాంబో మూవీ తెరకెక్కనుంది. అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎఫ్3 సినిమాతో అనిల్ రావిపూడి మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

బాలయ్య తర్వాత సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ఈ మధ్య కాలంలో కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్య కూతురు సైతం బాలయ్య సినిమాల కథల ఎంపికలో నిర్ణయాలు తీసుకుంటున్నారని బోగట్టా.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus