Laila: ‘సర్దార్’ మూవీ గురించి ఒకప్పటి హీరోయిన్ లైలా కామెంట్స్ వైరల్..!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అతను నటించిన ప్రతీ సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ‘యుగానికి ఒక్కడు’ ‘ఆవారా’ ‘నా పేరు శివ’ ‘ఊపిరి’ ‘ఖైదీ’ వంటి హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్యనే వచ్చిన హిట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్-1’ లో కూడా అతను నటించాడు. ఆ మూవీ కూడా తెలుగులో కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇక షార్ట్ గ్యాప్ లో కార్తి నుండి రాబోతున్న మరో చిత్రం ‘సర్దార్’.

అభిమన్యుడు ఫేమ్ పి ఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ప్రిన్స్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది . రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలకాబోతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ద్వారా 16 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా.

ఈరోజు ‘సర్దార్’ తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో లైలా కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ” తెలుగు ప్రేక్షకులకు నా పేరు చెప్పగానే ‘కొలబద్ద’ అనే పదం ఎక్కువగా గుర్తొస్తుంది.’ఎగిరే పావురమా’ జ్ఞాపకాలు నన్ను ఇప్పటికీ వెంటాడతాయి. ఇప్పటికీ శ్రీకాంత్ గారిని నేను అలాగే పిలుస్తాను.

ఇక ‘సర్దార్’ మూవీ కచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. ఇందులో యాక్షన్, రొమాన్స్ , స్పై ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ‘శివ పుత్రుడు’ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ‘సర్దార్’ కూడా దీపావళి కానుకగానే రిలీజ్ కాబోతుంది. నా పుట్టినరోజు(అక్టోబర్ 24) కానుకగానే ‘శివపుత్రుడు’ రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఇప్పుడు ‘సర్దార్’ కూడా నా పుట్టినరోజు కానుకగా రిలీజ్ కాబోతుంది” అంటూ చెప్పుకొచ్చింది లైలా.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus